సాంగ్ టాక్ : “వాల్తేరు వీరయ్య” రెండో సాంగ్ ఎలా ఉందంటే.!

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. యంగ్ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మళ్ళీ పాత చిరు ని అయితే చూడడం గ్యారెంటీ అని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చింది.

అలాగే వచ్చిన మొదటి సాంగ్ బాస్ పార్టీ కూడా మాస్ ని ఊపేయగా ఇప్పుడు ఎట్టకేలకు రెండో సాంగ్ ని చిత్ర యూనిట్ ఇప్పుడు రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ అయితే శ్రీదేవి చిరంజీవి అంటూ రిలీజ్ కాగా ఇదెలా ఉందో చూద్దాం. మొదటగా సాంగ్ లో విజువల్స్ అదిరిపోయాయి.

పైగా మెగాస్టార్ లుక్స్ మాత్రం బిగ్ హైలైట్ అని చెప్పొచ్చు. గత సినిమా గాడ్ ఫాదర్ తో పోలిస్తే చాలా ఫ్రెష్ అండ్ యంగ్ లుక్స్ లో తాను కనిపిస్తున్నారు. అలాగే తన గ్లామర్ తో శృతి హాసన్ కూడా అదరగొట్టగా సాంగ్ మాత్రం అనుకున్న రేంజ్ లో లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు.

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాదే లిరిక్స్ అందించగా బీట్స్ మాత్రం అంత పెద్దగా బాగోలేదని చెప్పొచ్చు. కానీ ఫస్ట్ వరకు సో సో గానే ఉన్నా లాస్ట్ చరణం మాత్రం మంచి కేజ్రీగా ఉందని చెప్పాలి. మెగాస్టార్ తన గ్రేస్ తో అక్కడ నుంచి సాంగ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లారని చెప్పొచ్చు.

ఇది మినహా సాంగ్ మాత్రం అంత చెప్పుకునే రేంజ్ లో లేదు. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తుండగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే జనవరి 13న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. 
Waltair Veerayya - Sridevi Chiranjeevi Lyric | Megastar Chiranjeevi, Shruti Haasan, DSP, Bobby Kolli