Devi Sri Prasad: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఈయన సంగీత దర్శకుడుగా ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న ఇటీవల పుష్ప 2 సినిమా ద్వారా సక్సెస్ కొట్టిన దేవిశ్రీప్రసాద్ త్వరలోనే తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని చెప్పాలి.
ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో నిర్మాత బన్నీ వాసు దేవిశ్రీప్రసాద్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఆయన పెళ్లి గురించి పలు విషయాలు తెలిపారు. దేవిశ్రీప్రసాద్ గతంలో చార్మితో ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని తెలుస్తుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. దీంతో ఎక్కడివెళ్లినా దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి.
తాజాగా నిర్మాత బన్నీ వాసు కూడా మాట్లాడారు. మా ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి కారణం దేవిశ్రీప్రసాద్ అని తెలిపారు. తనని ఇంట్లో అందరూ ముద్దుగా బుజ్జి అని పిలుస్తారు. మా సినిమాలో కూడా బుజ్జి తల్లి ఉంది. మరి మా బుజ్జి ఇక్కడ ఉన్నారు. ఆ తల్లి ఎక్కడుందో అంటూ బన్ని వాసు మాట్లాడారు. మా అందరికీ పెళ్లిళ్లు జరిగి పిల్లలు కూడా ఉన్నారు. త్వరలోనే దేవి శ్రీ ప్రసాద్ కు కూడా పెళ్లి జరిగి ఆయన పిల్లలు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ కావాలి అంటూ బన్నీ వాసు మాట్లాడారు.
ఇలా బన్నీ వాసు చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై దేవి శ్రీ ప్రసాద్ స్పందిస్తూ పెళ్లి కావడం కాకపోవడం అనేది మన చేతుల్లో లేదని రాసిపెట్టి ఉంటేనే పెళ్లి జరుగుతుంది అంటూ సైగల ద్వారా తెలియజేశారు. మరి దేవిశ్రీప్రసాద్ కు తన జీవితంలో పెళ్లి రాసిపెట్టి ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
