Ram Gopal Varma: పవన్ స్పీచ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన వర్మ…. ట్వీట్ వైరల్!

Ram Gopal Varma: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన చిత్రం భీమ్లా నాయక్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫిబ్రవరి 25 వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ గురించి ప్రతి ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ సినిమా గురించి పవన్ ఒకే మాటలో తెలియజేశారు.అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య మడమ తిప్పని ఓ యుద్దం ఈ చిత్రమని అన్నారు.ఈ విధంగా ఈ సినిమా గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వ్యాఖ్యలపై కాంట్రవర్సి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ తనదైనశైలిలో కామెంట్ చేశాడు.

ఈ సందర్భంగా వర్మ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఎంతో అద్భుతంగా, హుందా గా మాట్లాడారు. ఆయన వ్యవహరించిన తీరు అతని ప్రవర్తన ఎంతో మర్యాదపూర్వకంగా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ను స్టార్స్ అందరిలో కల్ల పవర్ ఫుల్ స్టార్ అంటారు. ఇప్పటివరకు ఆయన మాట్లాడిన స్పీచ్ లలో ఇదే ది బెస్ట్ స్పీచ్ అంటూ పవన్ కళ్యాణ్ గురించి వర్మ కామెంట్ చేశారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.