రష్మిక మందన్న ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించుకుంది.ఇకపోతే రష్మిక కెరియర్ మొదట్లో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి ఆయనను పెళ్లి చేసుకోవాలని భావించారు.ఈ క్రమంలోనే పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుపుకున్న రష్మిక కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అయితే ఈమె రక్షిత్ శెట్టి నుంచి విడిపోవడానికి కారణం వేణు స్వామి అని తాజాగా ఆయన వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి రష్మిక గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వేణు స్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ రష్మిక,రక్షిత్ శెట్టి జాతకాలు పరిశీలించిన అనంతరం తను తన ప్రియుడు రక్షిత శెట్టి నుంచి విడిపోతేనే మంచిదని అలా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకుంటేనే తన కెరియర్ బాగుంటుందని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పినట్లు వెల్లడించారు.ఇకపోతే తన కెరియర్ దృష్టిలో పెట్టుకున్న రష్మిక తన ప్రియుడుతో బ్రేకప్ చెప్పుకుందని ఈయన వెల్లడించారు.
ఈ విధంగా రష్మిక తన ప్రియుడుతో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత హైదరాబాదులోని తన నివాసంలో కొన్ని పూజలు చేశానని ఇలా పూజలు చేయడంతోనే తను స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ప్రస్తుతం రష్మిక గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేణు స్వామి నిత్యం పలువురు సెలబ్రిటీల గురించి వారి జాతకాలు గురించి బయట పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈయన రష్మిక గురించి మరోసారి సంచలన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచారు.