పవన్ కళ్యాణ్, శ్రీజ జాతకంలో నాలుగు పెళ్లిళ్లు..?

వేణు స్వామి గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా వార్తల్లో పెద్ద ఎత్తున నిలుస్తున్నారు.ఈయన తరచూ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీల గురించి వారి జాతకాలు గురించి జోష్యం చెబుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఈయన ఎంతోమంది సెలబ్రిటీల గురించి వారి జాతకాల గురించి తెలియజేశారు.ఈ క్రమంలోనే వేణు స్వామి గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయనకు రాజకీయాలు కలిసి రాలేదని చెప్పారు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు చిరంజీవి కుమార్తె శ్రీజ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్,శ్రీజ ఇద్దరి జాతకం ఒకేలా ఉందని వీరి జాతకంలో కుజుడు నీచంలో ఉండటం వల్ల వీరి జాతకంలో నాలుగు పెళ్లిళ్లు జరుగుతాయని ఉంది అంటూ ఈయన వీరి పెళ్లిళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి జాతకంలో కుజుడు నీచంలో ఉండటం వల్ల వీరి జాతకంలో వీరిద్దరూ నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారని ఈయన తెలిపారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇద్దరినీ పెళ్లి చేసుకుని వారిద్దరికీ విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే త్వరలోనే ఈయన కూడా నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారని వేణు స్వామి తెలిపారు.

ఇకపోతే చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ విషయానికి వస్తే ఈమె మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమె అతనికి విడాకులు ఇచ్చే తన సమీప బంధువైన కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. కొంతకాలం పాటు ఆమె జీవితంలో ఎంతో సంతోషంగా ఉంది.అయితే గత కొంతకాలం నుంచి కళ్యాణ్ దేవ్ దూరంగా ఉన్నారని తెలియడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా వీరిద్దరి విడిపోయారని, త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో ఈ విషయంపై ఎంతోమంది స్పందిస్తూ ఈ వార్తలను తిప్పి కొట్టారు. అయితే ఈమె జాతకంలో కూడా మూడు పెళ్లిళ్లు కాకుండా ఏకంగా నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయని వేణు స్వామి కామెంట్స్ చేయడం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.