ఆ డైరెక్టర్ ఎలా మోసపోయాడో తెలిస్తే షాకవుతారు

Venky Kudumula

Venky Kudumula

 డైరెక్టర్ వెంకీ కుడుములకు జరిగిన సైబర్ మోసం గురించి అందరికీ తెలుసు. జస్ట్ కాస్త పరిచయం ఉన్న వ్యక్తి ఆయన్ను 63 వేలకు మోసం చేసేశాడు. అది కూడ ఆయన తీసిన సినిమాను అడ్డుపెట్టుకునే. డైరెక్టర్ వెంకీ డైరెక్ట్ చేసిన ‘భీష్మ’ చిత్రాన్ని జాతీయ అవార్డులకు దరఖాస్తు పెడతాననే పేరుతో ఈ డబ్బు వసూలు చేశాడు. డబ్బు చెల్లించిన డైరెక్టర్ వెంకీ తీరా మోసం జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. అసలు ఘటన వెనుక ఉన్న పూర్తి సమాచారాన్ని చెప్పుకొచ్చారు డైరెక్టర్ వెంకీ. ఒక వ్యక్తి ఆయనకు కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమమై అతనే ‘భీష్మ’కు నేషనల్ అవార్డు దరఖాస్తులకు పంపమని సలాహా ఇచ్చాడట.

ఈ విషయాన్ని నమ్మించడానికి సదరు మోసగాడు ఎంచుకున్న అంశం ‘భీష్మ’ సినిమాలోని ఆర్గానికి ఫామింగ్ అంశం. అంత మంచి విషయం చెప్పారు కాబట్టి జాతీయ అవార్డు ఖాయమని అంటూ డబ్బులు పంపమని అడిగాడట. ఆర్గానికి ఫామింగ్ మంచి అంశం అనేది నిర్వివాదాంశం కాబట్టి అవార్డుకు అప్లై చేయడంలో తప్పు లేదని అట్టే నమ్మేసిన వెంకీ డబ్బును ట్రాన్స్ఫర్ చేసాడట. ఆ వ్యక్తి మళ్ళీ ఫోన్ చేసి ఇంకొంత డబ్బు ఇవ్వమని, రీఫండ్ వస్తుందని అనడంతో అనుమానం వచ్చిన వెంకీ ఆ వ్యక్తి గురించి, బ్యాంక్ ఖాతా గురించి ఆరా తీసి మోసపోయానని గ్రహించాడు.

మోసపోయిన సంగతి బయటకు చెబితే పరువు పోతుందని భయపడి ఆయన బయటకు చెప్పకుండా ఉండలేదు. ఎలాగూ తప్పు జరిగిపోయింది కాబట్టి ఇండస్ట్రీలో ఇంకొకరు తనలా మోసపోకూడదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఆయన అభిప్రాయమూ సరైందే. అయినా ఆ మోసగాడు   డైరెక్టర్ వెంకీకి ఆయన సినిమాలోని పాయింట్ చూపించే మోసం చేయడం అనేది ఎంత కన్నింగ్ థాటో చూడండి.