Suresh babu: వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలకృష్ణ హోస్టుగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ తో పాటు తన అన్నయ్య సురేష్ బాబు కూడా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సురేష్ బాబు కూడా సినిమాల గురించి తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు తెలిపారు.
ఇకపోతే బాలకృష్ణ సురేష్ బాబుని ప్రశ్నిస్తూ మీ తమ్ముడు వెంకటేష్ లో ఉన్నటువంటి బలహీనత ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సురేష్ బాబు సమాధానం చెబుతూ సాధారణంగా వెంకటేష్ సినిమాలలో చెయ్యి తల వెనక్కి పెట్టుకొని గోకుతూ ఉంటారు అదే వారిలో ఉన్నటువంటి బలహీనత అంటూ సురేష్ బాబు తెలియజేశారు. సినిమాలలో ఈ సన్నివేశం కనుక కనపడితే అది తన మ్యానరిజం అని అందరూ భావిస్తారు.
నిజానికి వెంకటేష్ ఇలా చేతిని తన తల వెనక్కి పెట్టుకున్నారు అంటే ఆ సీన్ చేయటానికి తను కష్టపడుతున్నారని అర్థం. అలా ఏ సినిమాకైనా, ఏ సందర్భంలో అయినా చేసినా ఆ రోజు ఆ సీన్ ఇక తెగదు. డైరెక్టర్లకి ఆ రోజు చుక్ ప్యాకప్ చెప్పుకోవాల్సిందేనని తెలిపారు సురేష్ బాబు. ఆ బలహీనత ఇప్పటికీ ఉందని, ఇప్పుడు కూడా అలానే చేస్తుంటాడని తెలిపారు. అయితే చాలా సినిమాల్లో ఆయన దాన్ని ఒక మ్యానరిజంగా చూపించడం విశేషం అంటూ తన తమ్ముడి బలహీనత గురించి సురేష్ బాబు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.