“వీరసింహా రెడ్డి”..1 కోటి కోసం తంటాలు.!

balakrishna_veera_simha_reddy_movie_review-sixteen_nine

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర సంక్రాంతి మాత్రం నెక్స్ట్ లెవెల్ హైప్ తో సినిమాలు వచ్చాయి. అది కూడా ఇద్దరు స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లు నటించిన సినిమాలు వాల్తేరు వీరయ్య మరియు వీరసింహా రెడ్డి సినిమాలు అయితే వచ్చాయి. కాగా ఈ సినిమాల్లో వాల్తేరు వీరయ్య పై చేయి సాధించి భారీ హిట్ అందుకోగా కెరీర్ లో మరో హైయెస్ట్ వసూళ్లు మెగాస్టార్ ఖాతాలో పడ్డాయి.

ఇక వీరసింహా రెడ్డి విషయానికి వస్తే బాలయ్య మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ అందుకొని బాలయ్య కెరీర్ లో రికార్డు బ్రేకింగ్ వసూళ్లు ఈ సినిమా అందుకుంది. కానీ సరిగ్గా రెండో రోజు నుంచే భారీ ఎత్తున గ్రాఫ్ పడిపోయింది. అక్కడ నుంచి నెట్టుకొచ్చిన వీరసింహా రెడ్డి రికార్డులు కూడా చాలా చోట్ల పడిపోయాయి.

కానీ ప్రిస్టేజ్ కి వెళ్లి మాత్రం ఓ రికార్డుని అభిమానులు సంపాదించుకున్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాల్లో తెలుస్తుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సింగిల్ స్క్రీన్ కి గాను 1 కోటి రూపాయల గ్రాస్ ని అందుకుంది. దీనితో మరోసారి బాలయ్య తన సత్తా చూపించాడు అంటున్నారు.

కానీ ఇక్కడ అసలు నిజం ఏమిటంటే అక్కడ కూడా ఎప్పుడో వసూళ్లు పడిపోయాయి కానీ 1 కోటి కోసం అయితే అక్కడ ఫ్యాన్స్ డబ్బులు పోగేసి ఈ రికార్డు సొంతం చేసుకున్నారట. మరి మరో పక్క తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్ లో కూడా అంతెందుకు బాలయ్య కి పట్టు ఉన్న సీడెడ్ లో కూడా ఈ ఫీట్ వీరసింహా రెడ్డి అందుకోలేదు. అలాంటిది అక్కడ వచ్చింది అంటే అది జెన్యూన్ కాదని కొందరు అనేస్తున్నారు. మొత్తానికి 1 కోటి కోసం వీరసింహా రెడ్డి తంటాలు ఇలా ఉన్నాయి.