ఇండస్ట్రీ టాక్ : టార్గెట్ కి ఇంకా కష్టపడుతున్న “వీరసింహా రెడ్డి”.!

filmcompanion_2023-01_9e0e600b-610a-402d-a21c-a03567b1ceb1_Review_Lead__Veera_Simha_Reddy__1

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన చిత్రాల్లో మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం “వీరసింహా రెడ్డి” కూడా ఒకటి కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని అయితే తెరకెక్కించాడు. అయితే మొదట మూడు రోజులు టాక్ తో సంబంధం లేకుండా బాలయ్య బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడించాడు.

అయితే నెమ్మదిగా ఈ చిత్రం మాత్రం తర్వాత నుంచి స్లో అయిపోయింది. దీనితో వసూళ్లు తగ్గగా నెక్స్ట్ బాలయ్య కెరీర్ లో అఖండ వసూళ్లు కూడా ఈ చిత్రం దాటేసింది. కానీ అనూహ్యంగా ఈ సినిమా మాత్రం పెట్టుకున్న టార్గెట్ కి మాత్రం రీచ్ అవ్వడానికి ఇంకా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా బిజినెస్ సుమారు 80 కోట్లకి పైగానే జరగగా ఈ మొత్తాన్ని ఈ సినిమా ఇంకా అందుకోలేదట. టార్గెట్ కి ఇంకా కొన్ని కోట్ల దగ్గరలో ఉందట. అయితే అంత ఫాస్ట్ వసూళ్లు అందుకొని ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఇంకా కష్టపడుతూ ఉండడం అనేది సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

అంతే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం ఇదే రన్ ని కొనసాగిస్తోంది. ప్రస్తుతానికి ఇంకా 2 నుంచి 5 కోట్లు షేర్ వసూలు చేస్తే గాని టార్గెట్ కి చేరుకున్నట్టు కాదట. ఇక అది దాటాలి అలాగే లాభాలు కూడా అందిస్తే తప్ప వీరసింహా రెడ్డి బ్లాక్ బస్టర్ గా నిలిచినట్టు కాదు అని చెప్పాలి. మరి బాలయ్య ఇదంతా ఎప్పుడు చేస్తాడో చూడాలి.