పవన్ – బాలయ్య ఎపిసోడ్ పై “వీరసింహా రెడ్డి” డైరెక్టర్ కామెంట్స్.!

టాలీవుడ్ ఇద్దరు మాస్ గాడ్ లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణల పై ప్రముఖ ఓటిటి యాప్ ఆహా వారు ప్లాన్ చేసిన బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అన్ స్టాప్పబుల్ సీజన్ 2 సరికొత్త ఎపిసోడ్ ని ప్లాన్ చేయగా నిన్ననే ఈ ఎపిసోడ్ పై ఓ అదిరే ఫస్ట్ ప్రోమో ని అయితే రిలీజ్ చేయగా దీనికి ఇప్పుడు అదిరే రెస్పాన్స్ వచ్చింది.

దీనితో ఈ ఎపిసోడ్ టాలీవుడ్ వర్గాల్లో కూడా ఆసక్తిగా మారగా ఈ ఎపిసోడ్ పై బాలయ్య లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “వీరసింహా రెడ్డి” చిత్రం దర్శకుడు గోపీచంద్ మలినేని అయితే ఇంట్రెస్టింగ్ పోస్ట్ ద్వారా కామెంట్స్ చేసి తెలిపారు. “ఈ ఫుల్ ఎపిసోడ్ కోసం చాలా ఆసక్తిగా నేను ఎదురు చూస్తున్నాను, నా ఇద్దరు ఫేవరెట్ స్టార్స్ ఒకే స్టేజ్ పై కనబడడం ఈ ఎపిసోడ్ పవర్ ఫుల్ గా ఉండబోతుంది.”

అని తాను తన ఎగ్జైట్మెంట్ ని వ్యక్తం చేశారు. అయితే ఇన్ని రోజు గోపీచంద్ ఫేవరెట్ బాలయ్య ఒకరే అనుకున్న వారికి గాను పవన్ కూడా మరో అభిమాన హీరో అని దీనితో తెలిసింది. ఇక ఇదిలా ఉండగా నెక్స్ట్ అయితే గోపీచంద్ పవన్ కోసం కూడా ఓ సబ్జెక్టు రెడీ చేసానని తెలిపారు. వీటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే అనుకున్నట్టే దీనిని కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేయగా ఈ ఫిబ్రవరి 3న మొదటి భాగం స్ట్రీమింగ్ కి రానుంది.