Veena vani: వేణు స్వామి వారిగా వీణవాణి అందరికీ ఎంతో సుపరిచితమే . ఇక ఈమె వీణ వాయిస్తూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండడం ఇటీవల కాలంలో వీణ వాణి కూడా తన భర్తతోపాటు సోషల్ మీడియా వివాదాలలో నిలుస్తూ ఉన్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా వీణా వాణి సైతం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా గురించి ఒక వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ ఈమె అల్లు అర్జున్ నటన అలాగే సుకుమార్ డైరెక్షన్ పై ప్రశంసలు కురిపిస్తూ ఈ వీడియోని విడుదల చేశారు. అయితే తాజాగా అల్లు అర్జున్ అరెస్టు కావడం ఈయన జైలు నుంచి బయటకు రావడంతో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనని పరామర్శిస్తూ ఉన్నారు. అయితే తాజాగా వీణ వాణి సైతం సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అరెస్టు గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఈమె ఒక వీడియోని విడుదల చేశారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి రావడంతో తన కుటుంబ సభ్యులు ఆయనకు దిష్టి తీస్తున్నటువంటి వీడియోని షేర్ చేస్తూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేను ముందే చెప్పాను కదా దిష్టి తీయించుకోండని అప్పుడు నా మాట వినలేదు. పోనీలే ఇప్పుడైనా నా మాటపై కాస్త గౌరవం ఉంది. ఇప్పుడు మీకున్న దిష్టి మొత్తం తొలగిపోయింది ఇకపై మీరు చేయాల్సిన పనులన్నింటినీ చేసేసుకోండి అంటూ ఈమె ఈ వీడియోని షేర్ చేశారు.
అయితే పుష్ప సినిమా చూసిన తర్వాత ఈమె అల్లు అర్జున్ నటన ఎంతో అద్భుతంగా ఉందని కళామతల్లి ఆశీస్సులు ఉంటే తప్ప అలా నటించడం సాధ్యం కాదని తెలిపారు మీ నటనకు చాలా దిష్టి తగిలి ఉంటుంది. ఒక వంద గుమ్మడికాయలతో దిష్టి తీయించుకోండి అంటూ ఈమె సినిమా చూసిన తర్వాత సినిమా పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వీడియో చేశారు అయితే ఈ వీడియో చేసిన కొద్ది రోజులకే అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో మరో వీడియోని కూడా ఈమె పోస్ట్ చేశారు.