Varun Tej : బన్నీ కి నచ్చిన గని..! వరుణ్ నటన బాగుందన్న స్టైలిష్ స్టార్…!

Varun Tej: j:మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు వరుణ్ తేజ్ కూడా ఒకరు. కానీ విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వరుణ్ తేజ్ నటించిన చిత్రం గని, దానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది కానీ కొన్ని కారణాల వల్ల విడుదలకు ఆలస్యం అవుతూ వస్తోంది. మొత్తానికి ఏప్రిల్ 8న ఈచిత్రం విడుదల నిర్ణయించారు. ఈ సినిమా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.ు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాత. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటిస్తోంది.

ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక బాక్సర్ గా కనిపించనున్నారు.కిరణ్ కొర్రపాటి ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అంచనాలను పెంచి ఈ మూవీ రిలీజ్‌కి ముందే పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే సినిమా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద పొగడ్తలతో ముంచెత్తారట.బన్నీ మాట్లాడుతూ.. ‘వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడు. సిక్స్ ప్యాక్ తో కనిపించిన వరుణ్ నటన చాలా గొప్పగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పటికే విడుదలైన గని ట్రైలర్ కు చక్కని రెస్పాన్స్ వస్తోంది.ట్రైలర్ లో నా పంచ్‌ పవర్‌ చూసి ఏదైనా నమ్మేయాల్సిందే అంటున్నాడు వరణ్‌. ట్రైలర్ పవర్‌ ఫుల్‌ గా ఉంది. వరుణ్‌ పంచ్‌ కొడితే లారీ టైర్లు ఎగిరిపడే షాట్స్‌, కారు అమాంతం కదిలిపోయే షాట్స్‌ బాగున్నాయి. అన్నట్టు ఈ సినిమా నుంచి ఆ మధ్య షార్ట్ గ్లింప్స్ అనే పేరుతో చిన్నపాటి ట్రైలర్ ను వదిలారు. అది కూడా చాలా బాగుంది.. మొత్తానికి గని సినిమాతో వరుణ్ తేజ్ హిట్ కొడతాడో లేదో చూడాలి.