వరుణ్ తేజ్ బాక్సింగ్.. స్పెషల్ అప్డేట్ రెడీ!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా రోజులయ్యింది. చివరగా 2019లో గద్దల కొండ గణేష్, F2 సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న వరుణ్ ఆ తరువాత చెల్లి పెళ్లితో బిజీ అయిన విషయం తెలిసిందే. ఇక మొన్న కరోనా భారిన పడడంతో షూటింగ్స్ కు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. వరుణ్ ఇప్పుడు పవర్ఫుల్ గా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మొన్న F3 టీమ్ తో కలిసిన వరుణ్ వెంటనే మరో యాక్షన్ సినిమాను స్టార్ట్ చేశాడు. బాక్సింగ్ నేపథ్యంలో లాక్ డౌన్ కంటే ముందే ఒక సినిమాను సెట్స్ పైకి తెచ్చిన ఈ హీరో మళ్ళీ చాలా రోజులకి ఆ సినిమా షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. ఇటీవల ఆ సినిమా కోసం వర్కౌట్ కూడా స్టార్ట్ చేశాడు. గతంలో రెండు నెలలు విదేశాలకు వెళ్లి స్పెషల్ గా బాక్సింగ్ కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

ఇక ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఈ నెల 19న వరుణ్ 31వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఆ సందర్భంగా ఉదయం 10గంటల 10 నిమిషాలకు సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. కొత్త దర్శకుడు కిరణ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ ఇవ్వనున్నాడు.