ముంబైలో వరుణ్ తేజ్.. ఎందుకెళ్లినట్లు?

మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల హఠాత్తుగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో మీడియా అతన్ని ఎక్కువగానే ఫోకస్ చేసింది. ప్రస్తుతం కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వరుణ్ తేజ్ ఇంత సడన్ గా అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనే సందేహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

వరుణ్ తేజ్ అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను ప్రత్యేకంగా కలుసుకున్నట్లు తెలుస్తోంది. T సీరీస్ ఆఫీస్ లో వరుణ్ తేజ్ చాలా సేపు సందీప్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఎందుకు కలుసుకున్నారు అనే విషయంలో అనేక రకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.

వీరిద్దరూ సినిమా చేయడం కోసమే కలిసి ఉండవచ్చని టాక్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక మరోవైపు సందీప్ రణ్ బీర్ కపూర్ తో ‘ఎనిమల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రానుంది. ఇక ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.

అలాగే రీసెంట్ గా సందీప్, అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు. ఇక వరుణ్ తేజ్ మరోవైపు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవదారి అర్జున’ అనే సినిమా చేస్తున్నాడు. మరి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వరుణ్ తేజ్ సినిమా నిజంగానే ఉంటుందా లేదా అనేది తెలియాలి అంటే కాలమే సమాధానం చెప్పాలి.