వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. డేట్ ఫిక్స్ అయినట్లే!

ఇటీవల మణికొండలోని నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇప్పుడు తమ కలల వివాహానికి రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ నిశ్చితార్థం సింపుల్ గానే జరిగినప్పటికీ పెళ్లి మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగా జంట తమ పెళ్లి తేదీని ఖరారు చేసుకున్నారట.

తాజా బజ్ ప్రకారం, ఆగస్ట్ 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అయిన రెండు రోజుల తర్వాత ఆగస్ట్ 24 న వరుణ్ మరియు లావణ్య వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ జంట తమ ఇటలీలోని సుందరమైన ఒక హోటల్ బుక్ చేసే ప్రయత్నాలలో ఉన్నారట. గతంలో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ మరియు దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్‌ల గ్రాండ్ వెడ్డింగ్‌లను ఎలాగైతే నిర్వహించారో ఇప్పుడు అలానే వీరు కూడా ప్లాన్ చేస్తున్నారట.

అయితే వివాహా వేడుకకు కేవలం సమీప కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారట. సంతోషకరమైన ఈవెంట్‌కు ప్రత్యేకమైన ప్లాన్ మొదలైనట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. స్పై థ్రిల్లర్ గా తెరపైకి రానున్న ఈ సినిమాలో వరుణ్ మంచి యాక్షన్ రోల్ లో సర్ ప్రైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.