జబర్దస్త్ వేదికపై ఈ మధ్య వర్ష అనే కొత్త అందం మెరిసింది. బుల్లితెరపై సీరియల్స్‌తో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న వర్ష.. జబర్దస్త్ షోతో సెన్సేషన్‌గా మారింది. రాకింగ్ రాకేష్ స్కిట్స్, ఇమ్మాన్యుయల్ అనే ఆర్టిస్ట్ పక్కన కనిపించడం, ఈ ఇద్దరి జంటను బ్లాక్ అండ్ వైట్ అంటూ రోజా కౌంటర్లు వేయడంతో వర్ష ఫుల్ ఫేమస్ అయింది. అయితే వర్షకు వచ్చిన పాపులార్టీ ఎంత ఉందో ఓ వీడియోనే చెబుతోంది. దాదాపు నాలుగేళ్ల క్రితం ఎప్పుడో ఎక్కడో మాట్లాడిన వీడియోను వెతికి పట్టుకొచ్చి మరీ ఇప్పుడు వైరల్ చేశారు. అంటే వర్ష ఎంతగా క్రేజ్ తెచ్చుకుందో అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఆ మధ్య అనసూయ ఓ పిల్లాడి ఫోన్‌ను నేలకేసి కొట్టింది. ఈ ఘటనతో అనసూయపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. సెల్ఫీ అడిగితేనే ఫోన్ అలా విరగ్గొడతావా? అని నెటిజన్లు మండి పడ్డారు. అదే సమయంలో అప్పుడు అంతగా ఫేమస్ కాని వర్ష కూడా అనసూయపై దారుణమైన కామెంట్స్ చేసింది. నీ పిల్లల ఫోన్‌ను కూడా వేరే పెద్ద హీరోలెవరైనా పగలగొడితే ఏం చేస్తావ్? నీకు బాధ ఉండదా? అలానేనా? నువ్ చేసేది? అంటూ ఓ రేంజ్‌లో విరుచుకపడింది.
అయితే అప్పుడంటే అనసూయతో అంతగా పరిచయం లేదు వర్షకు. కానీ ఇప్పుడు ఒకే స్టేజ్‌ను పంచుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు మళ్లీ తెరపైకి రావడంతో వర్ష కాస్త ఇబ్బందిగా ఫీలైనట్టుంది. అందుకు వెంటనే క్లారిటీ ఇచ్చింది. ఆరోజు అలా మాట్లాడేశాను.. అనసూయ గురించి తెలీక మాట్లాడాను.. ఆమె చాలా మంచిది.. రంగస్థలం షోలో ఆమెను ఈ విషయంలో క్షమించమని అడిగాను.. ఆమె తరువాత నాకు ఎంతో సాయం చేసింది.. ఆమె చాలా గొప్పది అంటూ మొత్తానికి ప్లేటు ఫిరాయించింది. అనసూయతో ఎందుకు వైరం అని వర్ష అనుకుందో ఏమో.