Vijay:విజయ్-వంశీ పైడిపల్లి సినిమా కొత్త అప్డేట్..!

Vijay: తమిళ్ సినిమా హీరో దళపతి విజయ్ వరుస సినిమా విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇటీవల వచ్చిన విజయ్ సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న బీస్ట్ తో బిజీగా ఉన్నారు. బీస్ట్ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.ప్రేమికుల రోజు సందర్బంగా బీస్ట్ సినిమాలోని హలమితి హబిబో..పాట లిరికల్ వీడియోను విడుదల చేసారు చిత్ర యూనిట్. విడుదలైన రోజునుండి ఎప్పటికి అత్యధిక వ్యూస్ అందుకుంటూ రికార్డులు సృష్టిస్తుంది. ఈ పాటకు దళపతి విజయ్ తో పాటూ బుట్టబొమ్మ వేసిన స్టెప్పులిప్పుడు ఫుల్ వైరల్ గా మారాయి.అంతేకాదు షరా మామూలుగా వ్యూస్, లైక్స్ రికార్డ్స్ తో.. హలమితి హబిబో.. ఓ వైపు దుమ్ము రేపుతుంటే.. ఇక మరో పక్క సాధారణ జనం నుంచి సెలెబ్రిటీస్ వరకు ఈ పాట రీల్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ ఒక స్ట్రయిట్ తెలుగు చిత్రానికి సైన్ చేశారు. ఈ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ భాగాన్ని చెన్నైలోనూ, మిగిలిన భాగాన్ని హైదరాబాద్, అబ్రాడ్ లోనూ చిత్రీకరించాలని భావిస్తున్నారు.

వంశీ పైడిపల్లి, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ క్రేజీ మూవీ లో హీరోయిన్ గా రష్మిక,కైరా అద్వానీ,పూజా హెగ్డే ఇలా చాలా మంది పేర్లు తెరమీదకు వచ్చాయి. కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు రష్మిక మందన బాగుంటుందని అనుకుంటున్నారట. విజయ్ రష్మిక వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న తెలుగు చిత్రం ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి మరి.