వకీల్ సాబ్‌ ట్రైలర్ విడుదల ఈరోజే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే ఓ హిందీ రీమేక్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ హిందీ పింక్ (Pink) సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. అక్కడ అమితాబ్ చేసిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మహిళ ఎదుర్కోంటున్న కొన్ని సమస్యలను, లైగింక వేధింపులను ఈ సినిమాలో చర్చించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

 

 

ఇక విడుదలకు దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్రబృందం. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ సినిమా నుండి ట్రైలర్‌ను విడుదలచేయనుంది చిత్రబృందం. దీంతో ఓ రకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్యలో ఓ పండుగ వాతావరణం నెలకొంది. దీంతో ప్రస్తుతం వకీల్ సాబ్ ట్రైలర్ డే యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక మరోవైపు అసలు ట్రైలర్ ఎలా ఉంటుంది.. అనే ఆసక్తి అందరిలో ఉంది. హిందీ ‘పింక్’ లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను ‘వకీల్ సాబ్’లో పవన్ కళ్యాణ్ పోషిస్తుండడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

హిందీలో పింక్ అనేది ఓ సందేశాత్మక ఆఫ్ బీట్ సినిమాగా ఉంటుంది. అయితే ఆ సినిమాను తెలుగులో పూర్తిగా కమర్షియల్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. దీనికి తోడు పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా భారీ మార్పులు చేశారట. చూడాలి మరి ఈ సినిమా ఎలా అలరించనుందో.. ఇక విడుదల తేది దగ్గరపడుతుండడంతో.. ఇప్పటికే పోస్టర్స్.. పాటలు విడుదలయ్యాయి. అవన్ని మంచి క్రేజ్‌ను తెచ్చాయి.. ఇక ఈ సినిమాకు పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైమ్ దక్కించుకుందట. అమెజాన్ ప్రైమ్ వకీల్ సాబ్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించిన అన్ని సినిమాలు కూడా ప్రైమ్ వీడియోనే డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా.. తాజాగా ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని సమాచారం. దాదాపు 20 నుంచి 30 కోట్ల మధ్యలో ఆ డీల్ ఉండోచ్చని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.