కోర్టులో వాదించడం తెలుసు.. కోర్టుకేసి కొట్టడమూ తెలుసు అంటున్న వకీల్ సాబ్.. టీజర్ అదుర్స్?

Vakeel Saab Teaser - Pawan Kalyan

అబ్బ.. ఎన్ని రోజులు అయిందో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను వెండి తెర మీద చూడక. దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. తన అభిమానులను అలరించబోతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా సినిమాలు చేస్తూ.. తన అభిమానులకు ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ అందించడానికి సిద్ధం అవుతున్నారు. ఇక.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ టీజర్ మాత్రం ఈ సంక్రాంతికి రిలీజ్ అయిపోయింది. పవర్ స్టార్ ఏది చేసినా రికార్డు మోత మోగాల్సిందే. అలాగే.. టీజర్ కూడా రిలీజ్ అవడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో దున్నేస్తోంది.

Vakeel Saab Teaser - Pawan Kalyan
Vakeel Saab Teaser – Pawan Kalyan

టీజర్ మాత్రం అదిరిపోయింది. వకీల్ సాబ్ అంటే ఇలా ఉండాలి అన్న రేంజ్ లో ఉంది. నల్ల కోటులో మొదటి సారి పవన్ కళ్యాణ్ ను చూడటంతో పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.

అబ్జెక్షన్ యువరానర్.. కోర్టులో వాదించడం తెలుసు.. కోర్టుకేసి కొట్టడం తెలుసు.. అంటూ పవర్ స్టార్ చెప్పిన ఈ రెండు డైలాగ్ లు మాత్రం పేలాయి.

మొత్తం మీద పవర్ స్టార్ తన అభిమానులకు మాంచి సినిమాను త్వరలోనే అందించబోతున్నారు. ఈసినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించగా… పవన్ కు జోడిగా శృతి హాసన్ నటించింది. దిల్ రాజు, బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్.

Vakeel Saab Teaser - Pawan Kalyan | Sriram Venu | Thaman S