వకీల్ సాబ్ రాబోతున్నాడు.. ఫ్యాన్స్ కి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..!

వకీల్ సాబ్ రాబోతున్నాడు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఇటీవలే షూటింగ్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వకీల్ సాబ్ నుంచి టీజర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే మళ్ళీ వకీల్ సాబ్ టీజర్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని రూమర్స్ వచ్చాయి. కాగా తాజాగా వకీల్ సాబ్ రోతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కేవలం కొన్ని గంటల్లో వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ కాబోతోంది. చెప్పాలంటే ఈ సడన్ సర్‌ప్రైజ్ కి ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతీ ఒక్కరు ఉబ్బి తబ్బీబ్బౌతున్నారు.

పవన్ కళ్యాణ్ కోసం నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కాగా వకీల్ సాబ్ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టీజర్ న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1 న రిలీజ్ చేస్తున్నారు. 2021 మొదలయ్యే అర్థ రాత్రి సరిగ్గా 12.00 గంటలకి వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ చేస్తున్నారు. ఇది నిజంగా ఏ ఒక్కరు ఊహించని సర్‌ప్రైజ్. గత నెల నుంచి వకీల్ సాబ్ సినిమా నుంచి వరసగా సర్‌ప్రైజెస్ ఉంటాయని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఆ క్రమంలోనే న్యూయర్ ఎంటరవుతుండటం తోనే భారీ సర్‌ప్రైజ్ తో వకీల్ సాబ్ ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు.

వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శృతిహాసన్ గెస్ట్ రోల్ లో నటిస్తోంది. కాగా వకీల్ సాబ్ సినిమాని ఏప్రిల్ 9 న రిలీజ్ చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక న్యూ ఇయర్ సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేస్తున్న చిత్ర బృందం సంక్రాంతి పండుగ సందర్భంగా సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.