ఉప్పెన సినిమాకు క్లైమాక్సే ఆధారం, అదే సినిమాను నిలబెడుతుందని మొదటినుంచి చెప్పుకొచ్చారు. ట్రైలర్, కొన్ని డైలాగ్స్‌ను బట్టి చూస్తే అందులో హీరో చివర్లో చనిపోతాడని అనిపిస్తుంది. అయితే హీరో, హీరోయిన్లు చనిపోవడం అన్నది పాత క్లైమాక్సే. ఉప్పెనలో ఇంకేం కొత్తదనం ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే చివర్లో ఆ ట్విస్ట్ ఏంటో బయటకు వచ్చింది. హీరో మగతనాన్ని విలన్ విజయ్ సేతుపతి నిర్దాక్షిణ్యంగా కోసి పారేస్తాడట.
ఇక ఇదే సినిమాకు ఆయువుపట్టు అవుతుందని, ఎమోషన్ వర్కవుట్ అవుతుందని చిత్రయూనిట్ భావించింది. కానీ అదే నెగెటివ్ అయ్యేలా ఉంది. కోసేశారా? లేదా? కోసేస్తేనే ఒప్పుకుంటాం? లేదంటే డిజాస్టర్ చేసేస్తాం.. కోసేశారురోయ్ అంటూ రకరకాలు జనాలు ట్రోల్ చేస్తున్నారు. ఈ మేరకు క్లైమాక్స్‌ను వీడియోలు తీసి ట్విట్టర్‌లో వదులుతున్నారు. ఆ వీడియోలన్నీ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఉప్పెన క్లైమాక్స్ అందరికీ షాకింగ్‌లానే ఉంటుంది.
హీరో మగతనాన్ని తీసేయడం, ఆ తరువాత హీరోయిన్ తన తండ్రితో ఓ నాలుగు మంచి మాటలు చెప్పడంతో కథ ముగిసేలా ఉంది. ఏది ఏమైనా కూడా ఈ సీన్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. అయితే సినిమాలో లీనమైనప్పుడు ఆ సీన్ చూస్తే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని కొందరు అంటున్నారు. మొత్తానికి ఉప్పెన డైరెక్టర్, హీరో సాహసం చేశారనే చెప్పాలి. మరి సినిమాపై పూర్తి టాక్ ఎలా వస్తుందో కాసేపు ఆగితే తెలుస్తుంది.