మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న RC16 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా, ఓ ప్రత్యేకమైన కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుందని సమాచారం. బుచ్చిబాబు తన తొలి చిత్రం ఉప్పెనతో సాలీడ్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక రెండో ప్రయత్నంగా రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం, ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ముందుగా ‘పెద్ది’ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు మరో కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు ‘పవర్ క్రికెట్’ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది. క్రికెట్ నేపథ్యంలో నడిచే కథ కావడంతో, ఈ టైటిల్‌కు మంచి కనెక్ట్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో కుస్తీ కూడా ప్రధానమైన ఎలిమెంట్‌గా ఉండనుందని సమాచారం. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ విడుదల చేసే అవకాశముందని టాక్.
ఇప్పటి వరకు RC16 షూటింగ్ 22 రోజులు పూర్తయింది. మేకర్స్ మార్చి నుండి నెలకు 20 రోజులు షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండటంతో, మ్యూజిక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.