కేవలం పవన్ కళ్యాణ్ కోసమే దాదాపు రెండేళ్లపాటు ఎదురుచూసిన హరిశంకర్ కు ఊహించని విధంగా చేదు అనుభవాలు అయితే ఎదురవుతున్నాయి. హరీష్ పవన్ కళ్యాణ్ తో ఎలాగైనా తన తదుపరి సినిమా చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు అయితే చేశాడు. మొదట అనుకున్న భవదియుడు భగత్ సింగ్ కథ నచ్చక పోవడంతో ఆ తర్వాత మళ్ళీ తేరి కథను ను సరికొత్తగా సెట్ చేసుకున్న హరీష్, ఉస్తాద్ భగత్ సింగ్ అనే మరొక టైటిల్ తో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాడు.
ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశాయి. ఇక అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న సమయంలో మళ్లీ హఠాత్తుగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో రకరకాల రూమర్స్ అయితే వినిపించాయి. హరిష్ శంకర్ కూడా కాస్త హర్ట్ అయినట్లు కూడా ఒక టాక్ అయితే వినిపించింది.
ఇక మరోసారి దర్శకుడు పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలుసుకొని చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కూడా హరీష్ శంకర్ మాట్లాడిన విధానానికి పాజిటివ్ గానే స్పందించారట. తప్పకుండా సినిమా కంటిన్యూ చేద్దామని కాకపోతే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో టైమ్ వృధా కాకుండా రెడీ అవ్వాలి అని కొన్ని కీలకమైన సూచనలు అందించినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ కోరిక మేరకు హరీష్ ప్లాన్ తో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎలక్షన్స్ కంటే ముందే వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.