‘ఉస్తాద్ భగత్ సింగ్’.! కథ ముగిసినట్లే.!

పవన్ కళ్యాణ్ ఇప్పట్లో సినిమాలు చేసే అవకాశం లేదు. పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. సో, పాలిటిక్స్‌లో పవన్ కల్యాణ్ బిజీ అయిపోవల్సిందే. మరి, ఈ టైమ్‌లో ఆయన ఒప్పుకున్న సినిమాల పరిస్థితేంటీ.?

‘ఓజీ’ ఎలాగూ కంప్లీట్ అయిపోయింది. ఇక, ‘హరి హర వీరమల్లు’ పరిస్థితి మధ్యలోనే ఆగిపోయింది. ఎటొచ్చీ పెద్ద చిక్కు హరీష్ శంకర్ సినిమాకే. ఈ సినిమానే ఇప్పుడు ఆగిపోయిందన్న ప్రచారం మళ్లీ తెర పైకి వచ్చింది.

అసలు ఈ సినిమా మొదలైనప్పటి నుంచీ ముహూర్తం బాగా లేదు. మొదట ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ అనుకున్నారు. స్ర్టెయిట్ మూవీ అన్నారు. అది కాస్తా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అయ్యింది.

డైరెక్ట్ తెలుగు సినిమా కాస్తా ‘తెరి’ రీమేక్ అయ్యింది. మొదట్నుంచీ ఫ్యాన్స్ మొత్తుకుంటూనే వున్నారు ఈ సినిమా విషయంలో. రీమేక్ అయితే వద్దే వద్దు బాబోయ్ అంటూ. చాలా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు ఈ సినిమా విషయమై చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. .

ఎలాగైనా సినిమాని పూర్తి చేయాలన్న కసితో వున్నాడింతవరకూ హరీష్ శంకర్. కానీ, సాధించే అవకాశాలు కనిపించడం లేదు. పంతానికి పోయి ఎలాగోలా సినిమా పూర్తి చేస్తే ‘భోళా శంకర్’ మాదిరి పరిస్థితి తయారవుతుందని కొందరు హెచ్చరిస్తున్నారు.

అంత హడావిడిగా సినిమాని పూర్తి చేసి, విమర్శల పాలయ్యే దానికన్నా సినిమా ఆగిపోవడమే బెటర్.. అని ఇంకొందరు హెచ్చరిస్తున్నారు. ఏం చేస్తాడో హరీష్ శంకర్ చూడాలిక.!