Akhanda Movie: అఖండలో ఒక్క ఫైట్‌కి 20 జనరేటర్లు వాడము.. ఆ సమయంలో ఎంతో టెన్షన్ పడ్డాను…. సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్!

Akhanda Movie: ఇప్పటి వరకూ తాను పనిచేసిన సినిమాల్లో చూస్తే ఈ మధ్య వచ్చిన అఖండ సినిమాలోని ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ కోసం చాలా సమయం తీసుకున్నామని సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ అన్నారు. నిజానికి ఆ సీన్ డే టైంలో షూట్ చేయాల్సింది.. కానీ అది డార్క్‌లో చేయాల్సిన సందర్భం అని ఆయన చెప్పారు. ఎందుకంటే గుహలో లైట్ ఉండదు. కాబట్టి న్యాచురల్ లైటింగ్ ఉండాలని ఆయన అన్నారు. ఆ సీన్‌ కోసం అరకులో ఓ లోకేషన్ అనుకున్నామని, కానీ అది ఆ ప్రదేశాన్ని ఆడియన్స్ ఇప్పటికే చూసి ఉన్నారని, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెయిన్ టూరిస్ట్ స్పాట్ కాబట్టి చాలా మందికి తెలిసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి దాని కోసం తామంతా కలిసి వేరే సెట్ వేశామని, దాని కోసం చాలా లైట్లు కూడా వాడామని ఆయన చెప్పారు.

దాని వల్ల ఒక్క రోజుకి దాదాపు 4000 లీటర్ల డీజిల్ కాలిందని, 20 వరకూ జనరేటర్స్ కూడా ఉపయోగించామని ఆయన చెప్పారు. ఒకానొక సందర్భంలో ఇంత లేట్ అవుతుందేంటీ అనుకున్నారు. కానీ ఎన్ని అనుకున్నా బ్యాగ్రౌండ్‌లో వినకుండా ఫైనల్ ఔట్‌పుట్ ముఖ్యమని ఒక్కటే అనుకున్నామని ఆయన చెప్పారు. అది తనకు చాలా టఫెస్ట్ టైంగా భావించానని ఆయన అన్నారు. ఒక వైపు చాలా లేట్ అవుతుంది అనుకుంటే, మరో పక్క లైట్స్ అన్నీ వేడవుతున్నాయని, కాబట్టి కచ్చితంగా అక్కడ ఉష్ణోగ్రతలను మెయింటైన్ చేయాలి, ఆ సందర్భంలో ఆ ఫ్రేమ్ రేట్‌కి చేస్తే తప్ప ఫైట్ మాస్టర్స్‌కి ఫైట్‌ని క్వాలిటీగా ఇవ్వలేరని ఆయన తెలిపారు. అలా రావాలంటే చాలా లైటింగ్ ఉండాలని, కాబట్టి చాలా డార్క్‌లో పెట్టి ఆ సీన్ తీశామని రామ్ ప్రసాద్ చెప్పారు.

అంతే కాకుండా ఆ ఫ్రేమ్ సెట్ అయ్యేందుకు స్పాట్ అంతా వాటర్‌తో స్ప్రే చేశామని, యాక్టర్స్ అందరికీ కూడా వాస్‌లైన్, లేదా నూనె రాసి ఆ రిఫ్లెక్షన్‌లో షూట్ చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. వాటిని సెట్ చేసేందుకు తాను ఆఫ్రికన్ అమెరికన్ సీన్లు చూశానని, అలాంటి రిఫ్లెక్షన్‌లో తీయడానికి తాను చాలా కష్టపడ్డానని, అందుకే చాలా టైం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. తక్కువ సమయంలో ఆ సీన్ తీయాల్సి వచ్చిందన్న ఆయన, అప్పుడు తాను చాలా టెన్షన్ పడ్డానని ఆయన చెప్పారు. ఇకపోతే ముందుగా ఆ సెట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో అనుకున్నామని, కానీ మళ్లీ వేరే లొకేషన్స్ చూసేందుకు వెళ్లి వచ్చేటప్పటికీ దాదాపు 15 లక్షల విలువైన సెట్‌ అంతా సెట్ వేసేశారని ఆయన చెప్పారు. కానీ అది సెట్ కాకపోవడంతో బోయపాటి గారికి చెప్పానని ఆయన అన్నారు. ఆయన కూడా పాజిటివ్‌గా తీసుకున్నారని, ప్రొడక్షన్‌ హౌస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారని ఆయన స్పష్టం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తీయడానికి తామంతా ఒక తపస్సు చేసినట్టే అయిందని ఆయన చెప్పారు.