వద్దంటున్నా.. అవే వస్తున్నాయ్ ఆమెకి.!

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అందం పోత పోసినట్లుండే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది పోనీ, సౌత్‌లో అయినా అమ్మడి అందానికి తగిన గుర్తింపు దక్కిందా.? అంటే ఇక్కడా అది నెరవేరలేదు. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో ఐటెం గాళ్‌గా నటించింది. అంతకు ముందే హీరోయిన్‌గా ‘బ్లాక్ రోజ్’ అనే సినిమా చేసినప్పటికీ ఆ సినిమా ఇంతవరకూ రిలీజ్‌కి నోచుకున్నది లేదు.

ఇక, ప్రస్తుతం ఆమె చేతిలో మూడు, నాలుగు ప్రాజెక్టులున్నాయట కానీ, అవన్నీ కూడా స్పెషల్ సాంగ్ ఆఫర్లే. ‘వాల్తేర్ వీరయ్య’ తర్వాత ‘రావణాసుర’లోనూ స్సెషల్ సాంగ్ చేసింది ఊర్వశి రౌతెలా . త్వరలో బోయపాటి సినిమాలో రామ్‌తో కలిసి స్పెషల్ సాంగ్‌లో చిందేయనుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, వరుసగా ఐటెం సాంగ్ ఆఫర్లే వస్తున్నాయని బాధపడుతోందట.

హీరోయిన్ అవ్వాలని వచ్చిన ఊర్వశి రౌతెలాకి పాపం అదేంటో ఈ పరిస్థితి. నోరు తెరిచి మరీ హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వమని అడుగుతోందట. అయితే ఏమాత్రం మొహమాటం లేకుండా ఇలా సరిపెట్టుకోవాల్సిందేనని సూచిస్తున్నారట మేకర్లు. చూస్తుంటే అమ్మడు హీరోయిన్‌గా ఆశలు వదిలేసుకోవాల్సిందేనేమో అనిపిస్తోంది.