కరోనా లాక్ డౌన్ కారణంగా ఒక్కసారిగా వాయిదా పడిన సినిమాల్లో ఉప్పెన ఒకటి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. దాదాపు సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది గాని నిర్మాతలు రిస్క్ తీసుకోలేదు.
సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండడం అలాగే 50% కెపాసిటీతోనే థియేటర్స్ నడవడం వలన సేఫ్ కాదని వెనుకడుగు వేశారు. ఇక సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ పై ఇటీవల నిర్మాతలు సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఫిబ్రవరిలో సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాలని ఒక డేట్ ను ఫిక్స్ చేసిన్నట్లు సమాచారం.
ఫిబ్రవరిలో దాదాపు థియేటర్స్ మళ్ళీ యధావిధిగా 100% కెపాసిటీతోనే నడిచే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. జనాలు అయితే ఎప్పటిలానే సినిమాలను చూడటానికి ముందుకు వస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ఫిబ్రవరి 5న ‘ఉప్పెన’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి సినిమా వైష్ణవ్ తేజ్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.