Upendra : అల్లు అర్జున్ ను పొగుడుతున్న ఉపేంద్ర…. అంతలా బన్నీ ఏమి చేసాడో…!

Upendra : ఉపేంద్ర కన్నడ హీరోగా అందరికి సుపరిచితులు తెలుగులో కన్యాదానం,ఒకే మాట సెల్యూట్ ద్విభాషా చిత్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి చిత్రాల్లో నటించారు. హీరోగా ఉపేంద్ర నటించిన కన్నడ విభిన్న సినిమాలు ‘ఉపేంద్ర’ ‘రా’ వంటివి ఇక్కడ కూడా విడుదలై సక్సెస్ అయ్యాయి. అప్పట్లో ఉపేంద్ర కి ఉన్నా క్రేజ్ మామూలుది కాదు. కన్నడ తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉపేంద్ర.

ఇటీవలే గని సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. ఇక ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు చెప్పారు. సన్ అఫ్ సత్యమూర్తి సమయంలో అల్లు అర్జున్ గురించి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. అసలు అలా ఉంటాడని ఊహించలేదన్నారు.షూటింగ్ టైములో ఎంత యాక్టివ్ గా ఉండేవాడో, సెట్స్ లో కూడా అంతే యాక్టివ్‌గా ఉండేవాడు. నాకు రోజు అతని ఇంటి నుండీ భోజనం పంపించేవాడు.

ఆయన నాకు పంపించిన క్యారేజ్ లో నాకు ఇష్టమైన వంటకాలు అన్నీ ఉండేవి. అవి తెలుసుకుని మరీ నాకు స్పెషల్‌గా పంపేవాడు బన్నీ. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు బన్నీ నన్ను ఓ గిప్ట్‌లా చూసుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు ఉపేంద్ర. ఇక ఈ విషయం వైరల్ అవడంతో బన్నీ అభిమానులు బాగా ఖుషి అవుతున్నారు.ఇక బన్నీ పుష్ప పార్ట్ 2 కోసం షూటింగులో బిజీ ఉన్నాడు. పార్ట్ 1 కన్నా ఎక్కువ అంచనాలు పెరగడంతో మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు బన్నీ, సుక్కు.