పవన్ లా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్న బాలయ్య ! దబిడి … దిబిడే ఇక !

Updates on Balakrishna's next three films are going to be revealed on his birthday

నందమూరి నటసింహం బాలయ్య బాబు అభిమానులు సంగతి తెలిసిందే… ఆయన ఆప్యాయత చూయించినా… ఆగ్రహం చూయించినా ఆయన చూపు, స్పర్శ మా మీద పడిందని ఉబ్బితబ్బిబ్బయిపోతుంటారు. అలాంటిది ఈ నెలలో బాలయ్య బాబు అభిమానులకు ఇవ్వబోతున్న సర్ప్రైజస్ గురించి తెలిస్తే ఏమైపోతారో మరి ? జూన్ 10 న బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా ఆయన ప్రస్తుత మరియు భవిష్యత్ ప్రాజెక్ట్స్ నుండి అప్‌డేట్స్ రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవలనే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున తన తదుపరి మూడు చిత్రాల గురించి అప్‌డేట్స్ ఇచ్చి మెగా అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా చేసాడు. ఇప్పుడు అదే విధంగా నందమూరి అభిమానులకి బాలయ్య కూడా ఖుషీ చేయబోతున్నాడు.

Updates on Balakrishna's next three films are going to be revealed on his birthday

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది… నందమూరి అభిమానులతో పాటుగా ప్రతీ ఒక్కరికీ వీరిరువురి సినిమా మీద అంచనాలు అందనంత ఎత్తులో ఉంటాయి. ఈ కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రాబోతోంది. “అఖండ” అనే పవర్ ఫుల్ టైటిల్ తో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా సినిమా సిద్దమవుతుంది. అఖండ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన టీజర్, టైటిల్ పోస్టర్ విపరీతంగా వైరల్ అయ్యాయి. గత నెలలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుంది అని టాక్ వచ్చింది కానీ రాలేదు. దీంతో బాలయ్య అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మెయిన్ టీజర్ అండ్ సాంగ్ కూడా విడుదల చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి వినిపిస్తుంది.

లాక్ డౌన్ తరువాత రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వాస్తవానికి ఈ కథ ముందుగా బాలకృష్ణ దగ్గరికి వెళ్లిందట. అయితే కొన్ని కారణాల వలన ఆయనతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దాంతో ఈ దర్శకుడు కథని రవితేజకు తగినట్టుగా హీరో బాడీ లాంగ్వేజ్ ను మార్చుకుని ఆయనతో తీసి హిట్ కొట్టాడు. బాలకృష్ణతో ‘క్రాక్’ చేయలేకపోయినా, గోపీచంద్ మలినేని తన తరువాత సినిమాను ఆయనతోనే పట్టాలెక్కిస్తున్నాడట. ‘అఖండ’ షూటింగు పూర్తికాగానే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కు వెళుతుందట.

డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఎఫ్ 3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కామెడీతో కమర్షియల్ మూవీని తీసి హిట్ చేయడంలో సిద్ధహస్తుడైన అనిల్ రావిపూడి తదుపరి సినిమా కోసం బాలకృష్ణతో కలిసి రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వీరి కాంబోలో మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 10వ తేదీన ఈ మూడు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ఎనౌన్స్ మెంట్స్ రావొచ్చని అంటున్నారు.