Upasan: తోటి కోడలు లావణ్య త్రిపాఠికి ఊహించని షాక్ ఇచ్చిన ఉపాసన … ఆ మాత్రం ఉండాల్సిందే?

Upasana: సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఫ్యామిలీలలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఈ కుటుంబం గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వినపడుతూనే ఉంటాయి. వారి సినిమాలకు సంబంధించిన అంశాల గురించి లేదా వారి వ్యక్తిగత విషయాలు గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇకపోతే తాజాగా మెగాకోడల్లకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.

మెగా ఇంటికి పెద్ద కోడలుగా ఉపాసన అడుగుపెట్టారు అయితే గత ఏడాది లావణ్య త్రిపాఠి కూడా చిన్న కోడలుగా మెగా ఇంట్లోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక వీరిద్దరూ సొంత అక్క చెల్లెల మాదిరిగా చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా ఈవెంట్ జరిగితే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా సందడి చేస్తూ ఉంటారు. ఇకపోతే మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టిన తర్వాత లావణ్య త్రిపాఠి మెగా కుటుంబ సభ్యులందరికీ ఎంతో ఘనంగా పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట.

అయితే ఈ విషయంలో మాత్రం లావణ్య త్రిపాఠి కాస్త వెనకబడి ఉన్నారని చెప్పాలి ఇప్పటివరకు ఆమె ఒక ఈవెంట్ కూడా హ్యాండిల్ చేయలేకపోయారని తెలుస్తుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా వారు తీసుకున్నటువంటి కొత్త ఇంట్లో అందరినీ పిలిచి గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేయాలని భావించిందట. అయితే ఈ విషయంలో లావణ్య త్రిపాటికి ఉపాసన భారీ షాక్ ఇచ్చింది. లావణ్య పార్టీ ఇవ్వాలని ఆలోచన చేయకముందే ఈమె కొత్త సంవత్సరానికి ఎంతో ఘనంగా ఆహ్వానం పలుకుతూ పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేశారట.

ఈ విధంగా ఏదైనా ఒక ఈవెంట్ నిర్వహించడంలో ఉపాసన చాలా ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉంటారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇంటి పెద్ద కోడలు అంటే ఆ మాత్రం బాధ్యతగా ఉండాల్సిందే అంటూ ఈ విషయం తెలిసిన పలువురు కామెంట్లు చేస్తున్నారు.