సీరియస్.! అన్‌స్టాపబుల్ విషయంలో చిరంజీవి ససేమిరా.!

అదేంటీ, పవన్ కళ్యాణ్‌ని పిలిచి.. మెగాస్టార్ చిరంజీవిని వదిలేశారు.? నిజానికి, అల్లు అరవింద్ గ్రాండ్‌గా ‘ఆహా అన్‌స్టాపబుల్’ కోసం ఎప్పుడో చిరంజీవిని పిలిచి వుండాలి. గతంలో ఆహా వేదికపై చిరంజీవి కనిపించారుగానీ, అది వేరే కార్యక్రమం.

ఒకప్పటి మెగా కాంపౌండ్ నుంచి కొంత భాగం వేరు పడి, అదిప్పుడు అల్లు కాంపౌండ్ అయ్యింది. ఆ విషయం చిరంజీవి ఇటీవల నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతోందంటూ బోల్డన్ని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.

‘అందరి ఎదుగుదలనూ నేను ఇష్టపడతాను, కోరుకుంటాను..’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు, అల్లు అర్జున్ వేరు పడటం గురించి ప్రస్తావన వస్తే. మరి, అన్నయ్యను అమితంగా ప్రేమించే పవన్ ఎలా అన్‌స్టాపబుల్‌కి వెళ్ళారు.? అంటే, అది ‘బాలయ్య కోటా’ అంటున్నారు. ఆ బాలయ్య కోటాలో చిరంజీవి లేరా.? అంటే, అది మళ్లీ డౌటే.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చిరంజీవిని ‘ఆహా’ నుంచి పిలవలేదట. పిలిచినా వెళ్ళే ఆలోచన చిరంజీవికి అస్సలు లేదట.