రష్మికకీ, ఆమె మేనేజర్‌కీ గొడవ జరిగిందనీ ఇద్దరూ విడిపోయారనీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ గొడవకి సంబంధించి అసలు మ్యాటర్ 80 లక్షలకి సంబంధించింది అనేది పై పై ప్రచారం.
అయితే, కాస్త డీప్‌గా ఆరా తీస్తే, అంతకు మించి రెండింతలు.. ఆ పైన సొమ్ముకి సంబంధించిన వ్యవహారమనీ తెలుస్తోంది. రష్మిక పేరు చెప్పుకుని మనోడు బాగానే క్యాష్ చేసుకున్నాడట.
విషయం తెలిసి రష్మిక నిలదీస్తే నువ్వేం చేసుకుంటావో చేసుకో పో.. అని రివర్స్ అయ్యాడట. దాంతో, చేసేది లేక రష్మిక కాస్త కంగారు పడిందట. చివరికి కొందరు సినీ ప్రముఖుల సాయం తీసుకుని, ఈ వివాదాన్నిసెటిల్ చేసుకుందట.
లోపల ఇలాంటి వ్యవహారాలు చాలానే జరుగుతుంటాయ్ సినీ వర్గాల్లో. కానీ, చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి ఇష్యూస్ బయటికి వస్తుంటాయ్. అయినా రష్మిక చాలా చాలా తెలివైంది. షార్ప్ థింకింగ్ చేయగల సత్తా వున్నది. అలాంటి అమ్మాయ్ ఇంత వివాదం వచ్చేంత వరకూ ఎందుకు తెచ్చుకుంది.. అనేదే ఇప్పుడు సినీ వర్గాల్లో ఎవ్వరికీ అర్ధం కాని మిస్టరీ.
