ఇన్సైడ్ టాక్ : ఊహించని ఎలిమెంట్స్ తో పవన్ “ఓజి”.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో తాను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న లేటెస్ట్ చిత్రం మాత్రం ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ “ఓజి” అనే చెప్పాలి. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫుల్ ఆన్ యాక్షన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతూ ఉండగా పవన్ డేట్స్ బల్క్ గా ఈ చిత్రానికి ఇప్పుడు కేటాయించేసారు.

దీనితో ఈ సినిమాకి భారీ హైప్ కూడా సెట్ అయ్యింది. పైగా నిన్ననే విక్రమ్ నటుడు అర్జున్ దాస్ కూడా ఉన్నట్టుగా బిగ్ అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేశారు. ఇలా అంతకంతకు హైప్ పెంచుకుంటున్న ఈ సినిమాపై క్రేజీ థింగ్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. మేకర్స్ అయితే ఈ సినిమాని ఊహించని సబ్జెక్టు అండ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారట.

ఈ సినిమా నేపథ్యం అంతా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే.. అంటే 1950 దశకం టైం లో కనిపిస్తుంది అని స్ట్రాంగ్ ఇన్ఫో వినిపిస్తుంది. అంతే కాకుండా ఇప్పుడు పవన్ పై ఇంట్రో సీన్ తెరకెక్కించగా ఇది పవన్ కెరీర్ లోనే హైలైట్ సీక్వెన్స్ గా వచ్చింది అని సినీ వర్గాలు చెప్తున్నాయి.

దీనితో పవన్ సినిమా అయితే ఓ రేంజ్ లోకి వెళ్తుందని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా ప్రియాంక అరుళ్ మోహన్ అయితే హీరోయిన్ గా నటిస్తుంది అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.