బిగ్ రివీల్ : “లియో” పై ఉదయనిధి స్టాలిన్ రివ్యూ వైరల్..!

ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ ఎత్తున వినిపిస్తున్న ఏకైక సినిమా పేరు “లియో”. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరియు హీరో విజయ్ దళపతి కాంబినేషన్ లో తెరకెక్కించిన రెండో సినిమా ఇది కాగా ఈ సినిమా కోసం ఆడియెన్స్ అటు తమిళ్ నుంచి ఇటు తెలుగు సహా కన్నడ లో గట్టిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ భారీ చిత్రం రిలీజ్ మరొక్క రోజులో పడబోతుండగా ఈ సినిమా విషయంలో ఒక్క అంశం మాత్రం ఓ రేంజ్ లో సస్పెన్స్ గా మారిపోయింది. అసలు ఈ సినిమా కూడా లోకేష్ తన సినిమాటిక్ యూనివర్సల్ లో భాగంగా తీసాడా లేదా లేక ఒక స్ట్రైట్ సినిమానా అనేది పెద్ద చర్చగా మారగా..

ఇప్పుడు అయితే ఈ భారీ చిత్రం కోసం అంతా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాని ఆల్రెడీ చూసిన ఓ తమిళ స్టార్ హీరో కం డిస్ట్రిబ్యూటర్ నిర్మాత సహా రాజకీయ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన పోస్ట్ అండ్ సినిమా రివ్యూ అయితే వైరల్ గా మారిపోయింది.

కాగా తాను ఈ సినిమాపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ సంగీత దర్శకుడు అనిరుద్ వర్క్ లని మెచ్చుకొని లాస్ట్ లో “ఎల్ సి యూ” అని కూడా రివీల్ చేస్తూ మెన్షన్ చేసాడు దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకేష్ నుంచి ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో అలాంటి సినిమాగానే వస్తుంది అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనితో అర్ధ రాత్రి సమయంలో వేసిన ఉదయనిధి పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో సెన్సేషన్ గా మారిపోయింది. 
https://x.com/Udhaystalin/status/1714384657192804798?s=20