టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్రం కోసం నాగార్జున ఈ వయసులో కూడా బైక్ స్టంట్స్ చేసారు. భారీ యాక్షన్ సన్నివేశాలను దుబాయ్ లో చిత్రీకరించారు చిత్ర యూనిట్. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను పవన్ సత్తార్ దర్శకత్వం చేస్తున్నారు. ఆంగ్ల పదమే అయినా ఘోస్ట్ అనే పేరు సినిమా కు చక్కగా సరిపోతుందని ఈ టైటిల్ ను ఖరారు చేసారు.
ఇక ఇపుడు ఇదే టైటిల్ తో మరో సినిమా రాబోతోంది అయితే అది తెలుగులో కాదు కన్నడలో. శాండల్ వుడ్ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా మొదలు కాబోతుంది. ఇటీవల శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు. కన్నడతో పాటు తెలుగు,తమిళ, హిందీ భాషలలో సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఇలా ఒకే టైటిలుతో రెండు సినిమాలు ఏక కాలంలో రావడం తో పలు అనుమానాలు వస్తున్నాయి. నాగార్జున సినిమా నిర్మాతలు ఈ ‘ఘోస్ట్’ టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో ఇప్పటికే రిజిస్టర్ చేయించి ఉంటారు. కాబట్టి నాగ్ సినిమాకి ఇబ్బంది ఉండదు. అయినా నాగార్జున సినిమా నిర్మాణంలో ఉందని తెలిసి కూడా కనీస అవగాహన లేకుండా కన్నడ మేకర్స్ ఇలా టైటిల్ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. పైగా రెండు యాక్షన్ చిత్రాలే. అయితే ఇపుడు నాగార్జున సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది కాబట్టి కన్నడ సినిమా కన్నా ముందే తెలుగు సినిమా విడుదల అవ్వొచ్చు. కాబట్టి నాగార్జున సినిమాకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. అయితే ఈ విషయాన్నీ గుర్తించి కన్నడ ఘోస్ట్ సినిమా నిర్మాతలు టైటిల్ మారుస్తారేమో చూడాలి.