“విక్రమ్” భారీ సక్సెస్..ఇద్దరు మెగాస్టార్స్ తో కమల్ – లోకేష్ లు.!

లేటెస్ట్ గా సౌత్ ఇండియన్ సినిమా దగ్గరకి వచ్చి భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో కోలీవుడ్ సెన్సేషన్ “విక్రమ్” కూడా ఒకటి. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ మరియు ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా సూర్య మరియు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిలు విలన్ లుగా ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ హిట్ గా నిలిచింది.

అయితే మన తెలుగులో కూడా భారీ లాభాలను అందుకున్న ఈ చిత్రం సక్సెస్ మీట్ ని మళ్ళీ కమల్ అలాగే లోకేష్ కనగ్ రాజు లు వచ్చి ఘనంగా వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలకి ముందో తర్వాతో కానీ కమల్ ని మన టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ లు కలవడం ఆసక్తిగా మారింది.

విక్రమ్ సక్సెస్ అయ్యినందుకు గాను కమల్ మరియు దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ లకి చిరు శాలువా కప్పి సన్మానం చేసి టోటల్ చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలియజేసారు. దీనితో ఈ ఫోటోలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఇక మెగాస్టార్ అయితే ప్రస్తుతం భోళా శంకర్, గాడ్ ఫాదర్ మరియు వాల్తేర్ వీరయ్య సినిమాల్లో బిజీగా ఉన్నారు. అలాగే ఆచార్య భారీ ప్లాప్ అనంతరం చిరు మరింత స్లిమ్ లుక్ లోకి మారడం ఆసక్తిగా మారింది.