Naga Chaitanya : చైతూ వెబ్ సిరీస్ లో నటిస్తున్న భామలు ఎవరో తెలుసా..!

Naga Chaitanya : నాగచైతన్య అక్కినేని వారసుడి గా ఫిల్మ్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి జోష్ తో పర్వాలేదనిపించినా తర్వాత సామ్ తో కలిసి నటించినా ఏ మాయ చేసావేతో మంచి హిట్ కొట్టాడు.హీరోగా నిలదొక్కుకునే క్రమంలో కొన్ని హిట్లు కొన్ని ప్లాపులు చవి చూసాడు.ఇక వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు చూసాడు చైతూ. సమంతతో ప్రేమ,పెళ్లి తరవాత విడాకులు ఇలా జీవితం సాఫీగా లేదు. ఇక విడాకుల తర్వాత తన తండ్రి తో కలిసి తీసిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలయి మంచి విజయం సాధించింది.

ఇక ఏడాది ప్రారంభంలోనే బంపర్ హిట్ అందుకున్న చైతూ ఇపుడు వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. మనం, 24 వంటి చిత్రాలు తీసిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ నిర్మించబోతున్న ఈ హార్రర్ థ్రిల్లర్ కోసం నాగచైతన్య సిద్ధమవుతున్నాడు. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసారు డైరెక్టర్. పార్వతి మీనన్, ప్రియా భవాని శంకర్ కీలక పాత్రాల్లో నటించబోతున్నారు.

థాంక్యూ సినిమా పూర్తి అవడం తో మరోసారి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య ఈ సిరీస్ ను చేయబోతున్నాడు. ఇక చైతూ వరుస సినిమాలతో బిజీ గా తన షెడ్యూల్ ప్లాన్ చేసాడు. నాది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ను షైన్ స్క్రీన్ వారు నిర్మిస్తారు.డి వీ వీ దానయ్య ప్రొడ్యూసర్ గా విక్రమ్ ప్రభు డైరెక్షన్ లో ఒక సినిమా కు కమిట్ అయ్యాడు చైతూ. ఈ ఏడాది మొత్తం ఫుల్ బిజీ గా ఉండేలా ప్లాన్ చేసాడు అక్కినేని వారసుడు చూడాలి ఇందులో ఏ సినిమాలు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటాయో.