ట్విట్టర్ రివ్యూ : నాగ్ “ది ఘోస్ట్” కి సెన్సేషనల్ టాక్..!

ఈ దసరా కానుకగా మన తెలుగులో భారీ అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో అక్కినేని యువ సామ్రాట్ నాగార్జున సినిమా ది ఘోస్ట్ కూడా ఒకటి. ఓకే అహిఘ్ ఎండ్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే మొదటి నుంచి కూడా మంచి హైప్ లోనే ఉన్న ఈ సినిమాపై అయితే ట్విట్టర్ ప్రజానీకం ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చాలా బాగుందనే సాలిడ్ టాక్ తోనే ఈరోజు ఘోస్ట్ యూనిట్ కి స్టార్ట్ కాగా సినిమా నెక్స్ట్ లెవెల్ విజువల్స్ తో ఉందని అంటున్నారు.

ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోయాయని అంటున్నారు. అలాగే సినిమాలో ఎమోషన్స్ అయితే కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందట. అంటే ఫ్యామిలీ డ్రామా కొద్దిగా ఎక్కువయ్యినట్టు అనిపిస్తుందని అంటున్నారు.

ఇది తప్పితే మిగతా సినిమా అంతా సూపర్ అని నాగ్ మళ్ళీ హిట్ కొట్టేశారని సెన్సేషనల్ టాక్ అయితే ఈ సినిమాకి ఇప్పుడు దక్కింది. మొత్తానికి అయితే నాగ్ పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు నిలబెట్టుకున్నాడు. అంతే కాకుండా గరుడ వేగ తర్వాత మళ్ళీ ఓ ఇంటెన్స్ హిట్ కొట్టాడని చెప్పాలి.. ఫైనల్ గా ఈ చిత్రంలో కూడా ట్విస్టులు అదిరాయని అంటున్నారు. 
https://twitter.com/VSeazen/status/1577451100885483520