‘హరిహర వీరమల్లు’కి మళ్ళీ బ్రేక్ పడిందా.?

మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా ఇంకోసారి ‘పెద్ద బ్రేక్’ తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ కాకుండా మరో మూడు సినిమాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.

సముద్రఖని దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి సంబంధించి కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి నెలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఓజీ’కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకోనుంది. అన్నీ శరవేగమే.. ఒక్క ‘హరిహర వీరమల్లు’ తప్ప. ఏమో, అసలు ఆ సినిమా భవిష్యత్తు ఏమవుతుందో ఎవరికీ తెలియదాయె.

చెక్కుడు వ్యవహారాలు ఓ కొలిక్కి రావడంలేదనీ, ఈ కారణంగానే ‘హరిహర వీరమల్లు’ని పక్కన పెట్టి, మిగతా సినిమాలు పూర్తి చేయడానికి పవన్ సిద్ధమయ్యాడనీ అంటున్నారు.