షాకింగ్ : అనుష్క లుక్ విషయంలో మూవీ టీం పై ఊహించని ట్రోల్స్.. 

సౌత్ ఇండియా సినిమా దగ్గర హీరోయిన్స్ లో కూడా అనేకమందికి సూపర్ స్టార్డం ఉంది. మరి అలాంటి స్టార్ హీరోయిన్స్ లో మన టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా ఒకామె కాగా ఆమె ఇప్పుడు చేసిన లేటెస్ట్ చిత్రమే “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి”. అయితే చాలా కాలం తర్వాత అనుష్క నుంచి వస్తున్నా సినిమా ఇది కావడంతో మంచి అంచనాలు ఈ చిత్రంపై ఉన్నాయి.

మరి నిన్ననే ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అలాగే సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉన్నట్టుగా అనిపించగా ఇవన్నీ పక్కన పెడితే అనుష్క లుక్ కోసం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ ట్రైలర్ లో కొన్ని పర్టిక్యులర్ షాట్స్ చూసినట్టు అయితే వాటిలో అనుష్కను మరింత యంగ్ గా చూపించే ప్రయత్నమే చేశారు. అయితే ఈ ప్రయత్నంలో మేకర్స్ ఇప్పుడు స్వీటీ ఫ్యాన్స్ ఆగ్రహానికి లోను కావాల్సి వచ్చింది. వీటిలో అనుష్క మొహాన్ని ఏదో స్నాప్ చాట్ ఫిల్టర్ పెట్టి చేసినట్టుగా ఉంది అని అంటున్నారు.

ముఖాన్ని మరీ చిన్నగా చేయడంతో ఆ ఫ్రేమ్స్ లో అది క్లియర్ ఫిల్టర్ గా అర్ధం అయ్యిపోతుంది. దీనితో చేస్తే చేశారు కానీ మరీ ఇంత దారుణంగా చేస్తారా అనుష్క ఎలా ఉన్నా మేము చూస్తాం అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం స్వీటీ ఫ్యాన్స్ మాత్రం చిత్ర యూనిట్ పై ఈ విషయంలో అసహనంగా ఉండగా ఆమె లుక్ పట్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ ఇప్పుడు పడుతున్నాయి.