మహేష్ తో గట్టిగానే ప్లాన్ చేస్తున్న మాటల మాంత్రికుడు.. 

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న కొన్ని మోస్ట్ అవైటెడ్ క్రేజీ కాంబినేషన్ చిత్రాల్లో గడిచిన ఇన్నేళ్ళలో టాలీవుడ్ దగ్గర రెండు క్లాసిక్ చిత్రాలు అందించిన కాంబినేషన్ మాటల మాంత్రికుడు దర్శకుడు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ కూడా ఒకటి. మరి వీరి నుంచి ఎప్పుడైతే నెక్స్ట్ సినిమా అనౌన్స్ అయ్యిందో అక్కడ నుంచి అంచనాలు వేరే లెవెల్ కి వెళ్లాయి.

హ్యాట్రిక్ సినిమా కావడంతో ఆకాశమే హద్దు అన్నట్టుగా ఈ సినిమా స్టార్ట్ అవ్వగా చాలా లేట్ గా మాత్రం షూటింగ్ కంప్లీట్ అవుతూ వస్తుంది. ఇక ఫైనల్ గా ఈ చిత్రం రిలీజ్ కి ముందు మొదటి సాంగ్ కోసం పెద్ద రచ్చే నడిచింది. మెయిన్ గా సాంగ్ లీక్ అయిపోవడంతో మేకర్స్ ఆలస్యం చేయకుండా సాంగ్ రిలీజ్ ని అయితే సెట్ చేసేసారు.

మరి దాని నుంచి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ప్రోమో రిలీజ్ చేయగా ఆ సాంగ్ ని పక్కన పెడితే మహేష్ బాబు ని మాత్రం త్రివిక్రమ్ వీర మాస్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడు అనేది అర్ధం అయిపోతుంది. ఇప్పటికే అరవింద సమేత సినిమాతో మాస్ లో ఏ లెవెల్లో చూపించగలడో ప్రూవ్ చేసుకున్న త్రివిక్రమ్ ఇక మహేష్ లాంటి బిగ్ స్టార్ ని ప్రెజెంట్ చేస్తే ఆ బ్లాస్ట్ ఎలా ఉంటుందో గుంటూరు కారంతో చూపించేలా ఉన్నాడని చెప్పాలి. కాగా ఈ సినిమాలో యంగ్ బ్యూటీస్ శ్రీలీల మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. 
Dum Masala Song Promo | Guntur Kaaram Songs | Mahesh Babu | Trivikram | Thaman S |  S. Radha Krishna