Home Entertainment పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం.. దాని వెనుక ఇంత కథ ఉందా!!

పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం.. దాని వెనుక ఇంత కథ ఉందా!!

పవన్ కళ్యాణ్ సెట్స్‌పైకి రావడం మాట అటుంచితే.. వరుసగా సినిమాలను కమిట్ అవుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వకీల్ సాబ్ చిత్రమే ఇంకా పూర్తి కాలేదు. కానీ క్రిష్ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయి లైన్‌లో ఉంది. ఆ తరువాత వెంటనే హరిష్ శంకర్ సినిమా ట్రాకు ఎక్కి ఉంది. ఈ మధ్యే బండ్ల గణేష్‌ కూడా కర్చీప్ వేసినట్టు ప్రకటించాడు. ఇలా వరుసగా చిత్రాలు ప్రకటిస్తోన్న పవన్ తాజాగా దసరా కానుకగా మరో మూవీని అనౌన్స్ చేశారు.

Trivikram Is Behind The Pawan Kalyan Sagar K Chandra Project
Trivikram Is Behind The Pawan Kalyan Sagar k Chandra Project

సాగర్ కే చంద్ర తెరకెక్కించబోతోన్న ఈ మూవీ మలయాలీ చిత్రమైన ‘అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌’కి రీమేక్ అని తెలుస్తోంది. అయితే ఇది వరకు ఈ మూవీ మీద రకరకాల పుకార్లు వచ్చాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ దగ్గరకు ఈ మూవీ వెళ్లింది. దానికి ప్రధాన కారణం కూడా త్రివిక్రమేనట. ‘అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌’ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ దక్కించుకుంది. ఆ తరువాత ఏవేవో ప్రయత్నాలు చేసింది.

Trivikram Is Behind The Pawan Kalyan Sagar K Chandra Project
Trivikram Is Behind The Pawan Kalyan Sagar k Chandra Project

చివరకు ఈ మూవీని త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్‌కు చూపించడం. ఓకే అనడం అంతా జరిగిపోయింది. అయితే ఈ మూవీని త్రివిక్రమ్ తెరకెక్కించాలని పవన్ అడిగాడట. కానీ త్రివిక్రమ మాత్రం నో చెప్పాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండటం, పైగా పవన్ కోసం సపరేట్‌గా మరో కథ రెడీగా ఉండటంతో ఈ రీమేక్‌కు నో చెప్పాడట. మొదటి నుంచి ఈ రీమేక్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను సాగర్ కే చంద్ర చూస్తుండటంతో ఆయనే ఆ దర్శకత్వ బాధ్యతలను అప్పగించారట. ఇలా మొత్తానికి అఫీషియల్ ప్రకటన వచ్చే ముందు చాలా తతంగమే నడిచిందట.

Related Posts

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

బిగ్ బాస్ లవ్ స్టోరీలు.. భలేగా రాశారే.!

రియాల్టీ షో అనే పేరు పెట్టారుగానీ, అందులో రియాల్టీ కనిపించడంలేదు మొర్రో.. అంటూ పాపం బిగ్ బాస్ అభిమానులు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. దానికన్నా యంగ్ టైగర్ ఎన్టీయార్ హోస్ట్‌గా సాగుతోన్న 'మీలో...

Related Posts

Latest News