పూజా, త్రివిక్రమ్.! ఇంకోస్సారి.!

అరరె, పూజా హెగ్దే ఎలా.? ఎందుకు ‘గుంటూరు కారం’ సినిమాని మిస్ అయ్యింది.? అదో మిస్టరీ.! కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ – పూజా హెగ్దే మధ్య మాత్రం కమ్యూనికేషన్ గ్యాప్ ఏమీ లేదట.

త్రివిక్రమ్ – పూజా.. ఇద్దరూ టచ్‌లోనే వున్నారట. పూజా హెగ్దే కోసమే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సబ్జెక్ట్ రెడీ చేశాడన్నది తాజా ఖబర్. ఓ యంగ్ హీరోతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారట.

అయితే, త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోవడంలేదనీ, కేవలం రచయితగా.. నిర్మాతగానే వ్యవహరిస్తాడనీ అంటున్నారు. పైగా, కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడట త్రివిక్రమ్. ఆ కొత్త దర్శకుడెవరు.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

పూజా హెగ్దేకి రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం ‘తగ్గే అవసరం’ రాకుండా త్రివిక్రమ్ చూసుకుంటున్నాడట.