త్రివిక్రమ్ మ్యాజిక్.! ‘గుంటూరు కారం’ వేరే లెవల్.!

అసలు ఈ సినిమా వస్తుందా.? రాదా.? స్క్రాప్ చేసెయ్యడమే బెటర్.! ఇలా చాలా చాలా కామెంట్లు, ‘గుంటూరు కారం’ సినిమా చుట్టూ వినిపించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్‌బాబు కాంబినేషన్‌లో నిర్మితమవుతున్న సినిమా ఇది.

పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సి వుండగా, అనివార్య కారణాల వల్ల ఆమె తప్పకుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లు ఇప్పుడు.

సినిమా నిర్మాణం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. సంక్రాంతికి సినిమాని విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్ కూడా జోరందుకోనున్నాయి. మొదట్లో సినిమా అలస్యానికి చాలా కారణాలున్నాయి. ఆ కారణంగానే, స్క్రిప్టు పరంగానూ కొంత గందరగోళం ఏర్పడిందట.

అయితే, త్రివిక్రమ్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, చకచకా చిన్నా చితకా మార్పులు చేసేశాడట. ఇంకా చేస్తూనే వున్నాడట. తన మీద వస్తున్న విమర్శల నేపథ్యంలో త్రివిక్రమ్ చాలా చాలా కసిగా సినిమాని తెరకెక్కించాడట.

‘మీరు ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి.. అన్ని అంచనాల్నీ సినిమా అందుకుంటుంది.. అంతకు మించి అనే స్థాయిలోనే వుంటుంది..’ అని నిర్మాత చెప్పడమే కాదు, చిత్ర యూనిట్ సభ్యులూ చెబుతున్నారు.

మహేష్ కూడా వస్తున్న ఔట్ పుట్ చూసి సూపర్ హ్యాపీ అట.! ఈ మార్పుల్ని తానే ఊహించలేదని, మహేష్ నేరుగా త్రివిక్రమ్‌తో చెప్పాడట కూడా.!