రాజమౌళి కి త్రివిక్రమ్ సవాల్

రాజమౌళి, త్రివిక్రమ్ ఇద్దరూ స్టార్ డైరెక్టర్ లు. ఎవరిశైలి వాళ్ళది, ‘బాహుబలి’ తో రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతే, త్రివిక్రమ్ మాత్రం ఇంకా తెలుగు డైరెక్టర్ గానే మిగిలిపోయాడు. బయటకి చెప్పకపోయినా రాజమౌళి, త్రివిక్రమ్ మద్య కోల్డ్ వార్ నడుస్తుందనేది ఒక రూమర్ ఉంది. ఎవరు ఎంత హిట్ ఇచ్చినా…ఒకరి సినిమా గురించి ఇంకొకరు కనీసం ఒక ట్వీట్ కూడా చెయ్యరు.

రీసెంట్ గా త్రివిక్రమ్ కి చాలా సన్నిహితుడైన సూర్య‌దేవ‌ర నాగవంశీ మాట్లాడుతూ.. ఎప్పటికైనా హాలీవుడ్ రేంజ్ సినిమా త్రివిక్రమ్ తో చేయాలన్నది తన కోరిక అన్నారు. అది ఎలాంటి సినిమా, ఎవరితో సినిమా అన్నది ఆ టైమ్ వచ్చినపుడు డిసైడ్ చేస్తామన్నారు.

అయితే మహేష్ బాబు తో సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ ప్రభాస్ తో ఒక సినిమా, అలాగే రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడని నాగ వంశీ అన్నాడు. సూర్య‌దేవ‌ర నాగవంశీ మాట్లాడుతూ.. ఎప్పటికైనా హాలీవుడ్ రేంజ్ సినిమా త్రివిక్రమ్ తో చేయాలన్నది తన కోరిక అన్నారు. అది ఎలాంటి సినిమా, ఎవరితో సినిమా అన్నది ఆ టైమ్ వచ్చినపుడు డిసైడ్ చేస్తామన్నారు.