త్రివిక్రమ్ తకధిమితోం.! మనసుపెట్టలేకపోతున్నాడట.!

ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో ఎన్నడూ లేనంత ఒత్తడిని ఎదుర్కొనాల్సి వస్తోంది. దానికి కారణాలు అనేకం. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ కృష్ణ మరణం సహా అనేక కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఏకబిగిన సినిమాలో మెజార్టీ షూట్ పార్ట్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, పరిస్థితులు అనుకూలించేలా కనిపించడంలేదట.

కథ విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తాలూకు సారాంశం. పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో త్రివిక్రమ్ సహాయ పడుతుండడం సహా అనేక కారణాలతో, మహేష్ సినిమా మీద పూర్తిగా ఫోకస్ పెట్టలేకపోతున్నాడట త్రివిక్రమ్. ఈ విషయమై మహేష్ కూడా అసహనంతో వున్నాడంటున్నారు.