పవన్ ప్రాజెక్ట్.. త్రివిక్రమ్ కావాలనే జారుకున్నాడా?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్స్ లిస్ట్ తీస్తే అందులో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబో టాప్ లో ఉంటుందని చెప్పవచ్చు. వీరి కాంబినేషన్ లో మరొక్క సినిమా పడితే చూడాలని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ ఇంకా సెట్టవ్వడం లేదు. ఇక పవన్ కథల ఎంపిక విషయంలో త్రివిక్రమ్ పాత్ర ఉన్నట్లు కొన్ని రూమర్స్ వైరల్ అవ్వడం కామన్. ఇక అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ చేయడానికి కారణం కూడా త్రివిక్రమ్ ముఖ్య కారణమని కొన్ని రూమర్స్ వస్తున్నాయి.

ఇక స్క్రిప్ట్ సెట్ చేసే క్రమంలో కూడా త్రివిక్రమ్ దర్శకుడితో ఉన్నట్లు తెలుస్తోంది. యువ దర్శకుడు సాగర్ చంద్ర, పవన్ స్థాయికి తగ్గట్లు సినిమా తీయగలడా లేదా అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఆ అనుమానాలు నిర్మాతల్లో కూడా కలిగాయి. ఇక త్రివిక్రమ్ దగ్గరుండి సినిమా స్క్రిప్ట్ ను డిజైన్ చేయించిన్నట్లు టాక్ వస్తోంది. అయితే ఇప్పటివరకు త్రివిక్రమ్ పేరు ఒక్క పోస్టర్ లో గాని రాలేదు.

త్రివిక్రమ్ కావాలనే జారుకున్నాడా లేదా పవన్ కు ప్రతి సారి త్రివిక్రమ్ హెల్ప్ చేయడం అలవటయ్యిందనే ముద్ర పడకూడదని అలా చేశాడా అనేది హాట్ టాపిక్ గా మారింది. స్నేహపూర్వకంగా పవన్ కు త్రివిక్రమ్ సినిమాల వరకే సహాయం చేస్తాడనేది తెలిసిన విషయమే. కానీ అతను పవన్ రాజకీయాల్లో కూడా డైలాగ్స్ రాస్తారని కొంతమంది నెగిటివ్ గా కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక పవన్ స్వతహాగా రైటర్ కాబట్టి ఆ రూమర్స్ ఎక్కువ రోజులు నిలవలేదు. మరి అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ విషయంలో త్రివిక్రమ్ పాత్ర ఉన్నప్పటికీ పేరు రాకుండా ఎందుకు చూసుకుంటున్నారనేది సస్పెన్స్ గా మారింది.