‘పొన్నియిన్ సెల్వన్’ లో తాను ధరించిన నగల గురించి ఆసక్తికర విషయాల వెల్లడించిన త్రిష..?

Trisha

సౌత్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరమైన త్రిష తమిళ సినిమాలలో మాత్రం నటిస్తూ బిజీగా ఉంది. ఇక ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ పోన్నియిన్ సెల్వన్ ‘ అనే సినిమాలో కూడా త్రిష కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష ఐశ్వర్యారాయ్ వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలలో నటించారు.

దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులను వేగవంతం చేశారు. ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న త్రిష సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ క్రమంలో ఈ సినిమాలో
చోళ దేశపు రాకుమారి కుందవై పాత్రలో నటించినట్లు ఆమె వెల్లడించింది.

ఇక ఈ సినిమాలో కుందవై పాత్ర కోసం దుస్తులు,నగల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు త్రిష వెల్లడించింది. ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం నిజమైన బంగారు నగలను దరించానని త్రిష చెప్పుకొచ్చింది. ఇక మణిరత్నం తెరకెక్కించిన ఈ భారీ చిత్రంలో ఒక భాగం కావడం చాలా ఆనందంగా ఉందని త్రిష ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇక సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.