ట్రైలర్ టాక్ : పక్కా పండుగ సినిమాలా నాగ్ “నా సామిరంగ”

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మూవీ ఫెస్టివల్ సంక్రాంతి కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ ఏడాదికి ఆ ఏడాది గట్టి పోటీలు ట్విస్ట్ లు నడుమ సినిమాలు అయితే వస్తున్నాయి. కాగా ఆల్రెడీ అన్ని సినిమాలు ట్రైలర్ లు సందడి అంతా కనిపిస్తుంది. కానీ కింగ్ నాగార్జున నటించిన అవైటెడ్ సినిమా “నా సామిరంగ” నుంచి మాత్రం చివరి నిమిషం వరకు టెన్షన్ నే నెలకొంది.

దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించగా నాగార్జున కెరీర్ లో 99వ సినిమా ఇది. మరి ఎట్టకేలకి ఈ సినిమా ట్రైలర్ కూడా వచ్చేసింది. మరి ఈ ట్రైలర్ మాత్రం మాములుగా లేదని చెప్పవచ్చు. స్టార్టింగ్ కొన్ని సెకండ్ లు సో సో గా సింపుల్ గానే ఉన్నా తర్వాత మాత్రం ఒక కంప్లీట్ ఏక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ ప్యాకెడ్ లా అనిపించింది.

ఇక నాగార్జున చరిష్మా కానీ తనపై మాస్ మూమెంట్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇంకా హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లకి పర్ఫెక్ట్ పాత్రలు ఈ సినిమాలో కనిపిస్తుండగా హీరోయిన్ ఆశికా రంగనాథ్ పాత్ర కూడా ఆసక్తికరంగా కనిపిస్తుంది.

మరి కీరవాణి ఇచ్చిన సంగీతం ట్రైలర్ లో విజువల్స్ చూస్తుంటే పక్కా పల్లెటూరు నేపథ్యంలో ఫామిలీ ఆడియెన్స్ ని మెప్పించే విధంగా ఉంటుంది ఈ సినిమా అనిపిస్తుంది. కాగా ఈ మాస్ జాతర సినిమా ఈ సంక్రాంతి రేస్ లో చివరి సినిమాగా జనవరి 14న బ్రహ్మాండమైన విడుదల కాబోతుంది. 
Naa Saami Ranga Trailer | Nagarjuna Akkineni | Allari Naresh | Vijay B | MM Keeravaani | SS Screens