ట్రైలర్ టాక్ : మైండ్ బ్లాకింగ్ ఏక్షన్ తో “అవతార్ 2” సర్ప్రైజింగ్ ట్రైలర్.!

వరల్డ్ సినిమా టాప్ మోస్ట్ దర్శకుడు జేమ్స్ క్యామెరూన్ నుంచి వచ్చిన ఎన్నో అద్భుత సృష్టిలలో గత పదమూడేళ్ల కితం తెరకెక్కించిన చిత్రం “అవతార్” కూడా ఒకటి. మరి పండోర గ్రహం అంటూ కొత్త కొత్త విజువల్స్ ని చూపించి అప్పట్లోనే భారీ వాసులు నమోదు చేసిన ఈ చిత్రానికి మళ్ళీ ఇన్నేళ్ల శ్రమ తర్వాత సీక్వెల్ ని రిలీజ్ చెయ్యడానికి పూనుకున్నారు.

ఇక ఈ బిగ్గెస్ట్ వండర్ ని అయితే ఈ డిసెంబర్ 16వ రిలీజ్ చేయబోతుండగా ఈ మాసివ్ మూవీ నుంచి గత కొన్ని రోజులు కితం వచ్చిన టీజర్ మరియు ట్రైలర్ లు భారీ స్పందన అందుకున్నాయి. ఇక ఇప్పుడు అయితే చిత్ర యూనిట్ వరల్డ్ వైడ్ ఆడియెన్స్ కి ఓ సర్ఫరైజింగ్ ట్రైలర్ వీడియో రిలీజ్ చేసి మరోసారి మైండ్ బ్లాకింగ్ ట్రీట్ ని అందించారని చెప్పొచ్చు.

మరి గత ట్రైలర్ తో పోలిస్తే ఎమోషన్స్ కన్నా కామెరాన్ అందరి అటెన్షన్ అందుకోడానికి ఏక్షన్ ఎలిమెంట్స్ ని బాగా దట్టించాడు. దీనితో ఈ ట్రైలర్ చూస్తేనే ఓ రేంజ్ లో అనిపిస్తుంది. అలాగే తన నీటి ప్రపంచంలో కొత్త విన్యాసాలు అలాగే మ్యూజిక్ కూడా అవుట్ స్టాండింగ్ గా కనిపిస్తుంది.

మొత్తం 2 నిమిషాల ట్రైలర్ గా డిజైన్ చేసిన దీనిలో అయితే లాస్ట్ 15 సెకండ్లు నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తున్నాయి. ఇక ఈ భారీ సినిమా అయితే ఈ డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా 120 భాషల్లో విడుదల కాబోతుండగా మన ఇండియాలో 7 భాషల్లో విడుదల కాబోతుంది.